చంద్రబాబు – తుఫాను సమయంలో కృషి చేసిన మంత్రులపై ప్రశంసలు

Andhra Pradesh CM Chandrababu Naidu praises ministers for their efforts during Montha cyclone Andhra Pradesh CM Chandrababu Naidu praises ministers for their efforts during Montha cyclone

AMARAVATHI: సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల సంభవించిన “మొంథా తుఫాను” సమయంలో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసిన మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు.

ప్రతి మంత్రి స్వయంగా ప్రజల్లోకి వెళ్లి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా జరిగేలా కృషి చేశారని ఆయన ప్రశంసించారు.

తుఫాను సమయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించారని, అందువల్లే సహాయక చర్యలు అత్యంత వేగంగా పూర్తి చేయగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు.

అలాగే, “ఆర్టీజీ సెంటర్” ద్వారా నిరంతర పర్యవేక్షణ, ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని వివరించారు.

మంత్రులు, అధికారులు టీమ్ స్పిరిట్‌తో పనిచేయడం ఈ విజయానికి ప్రధాన కారణమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తుఫాను సమయంలో అందరూ ఎంత కష్టపడ్డారో తాను ప్రత్యక్షంగా గమనించానని తెలిపారు.

ALSO READ:ఫీజు బకాయి వివాదం – పోలీసుల వేధింపులతో విద్యార్థి నిప్పంటించుకుని మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *