ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు సీనియర్ పోలీస్ అధికారులకు నాన్- క్యాడర్ ఎస్పీ హోదా నుండి ఐపిఎస్ హోదా లభించింది. ఐపిఎస్ హోదా పొందిన ఈ సీనియర్ అధికారుల్లో ఇద్దరు మహిళ అధికారులు, ఐదుగురు పురుషులు ఉండగా, వీరికి ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నాన్-కేడర్ ఎస్పీల నుంచి ఐపీఎస్ హోదాను మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ హోదా లభించిన అధికారుల జాబితాను విడుదల చేస్తూ జీవోను జారీ చేసింది.
2022 బ్యాచ్‌లో ఐపీఎస్ హోదా పొందిన అధికారులు:
1. ఎ. రమాదేవి
2. బి. ఉమా మహేశ్వర్
3. జె. రామ్మోహనరావు
4. ఎన్. శ్రీదేవి రావు
5. ఇజి అశోక్‌కుమార్
2023 బ్యాచ్‌లో ఐపీఎస్ హోదా పొందిన అధికారులు:
1. కెజివి సరిత
2. కె. చక్రవర్తి
గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అంశాన్ని త్వరితగతిన పూర్తిచేసి జీవో రూపంలో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాష్ట్రంలో శాంతి భద్రతల సుస్థిర స్థాపనకు కట్టుబడి ఉంటామని ఈ సీనియర్ అధికారులు డిజిపి శ్రీ ద్వారకా తిరుమల రావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఏడుగురు ఏపీ సీనియర్ పోలీస్ అధికారులకు ఐపీఎస్ హోదా
