విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన నేత, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యేను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెండి కిరీటంతో సత్కరించి, దేవుని పటాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గంలోని ప్రతి వార్డును పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన సేవలను ప్రజలు గౌరవిస్తున్నారని చెప్పారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే వంశీ కృష్ణ నిరంతరం పట్టుదలతో పనిచేస్తున్నారని కందుల పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సత్రం, రోడ్లు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఆయన విధానం ప్రశంసనీయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కందుల రాజశేఖర్, మద్ది రాజశేఖర్ రెడ్డి, గౌతమ్, అప్పారావు, కుమారి, కందుల కేదార్నాథ్, 32వ వార్డు ఇంచార్జ్ కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.