ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ ముఖ్యమంత్రి “చంద్రబాబు నాయుడు” భారీ పారిశ్రామిక పండుగకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన “ఎంఎస్ఎంఈ పార్కును” ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా “17 జిల్లాల్లోని 50 ఎంఎస్ఎంఈ(MSME) పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు ఇప్పటికే ఉత్పాదన దశలో ఉన్న రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
రెండో దశలో 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులు ప్రారంభించగా, మరో 587 ఎకరాల్లో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి వంటి ప్రాంతాల పారిశ్రామికవేత్తలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ALSO READ:ప్రజాకవి అందెశ్రీకి సీఎం రేవంత్ నివాళి —పాడె మోసి కన్నీరు పెట్టుకున్న సీఎం
పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.పార్కుల్లో విద్యుత్, నీరు, రహదారుల వంటి అన్ని మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పిస్తుంది. కేవలం ఆలోచనతో వస్తే చాలు, యూనిట్ ఏర్పాటు సులభం” అని చెప్పారు.
చెత్త నుంచి సంపద సృష్టించే ఆధునిక విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.
గత పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయని, పారిశ్రామికవేత్తలు పారిపోయారని విమర్శించిన చంద్రబాబు, “ఇప్పుడు ఏపీ బ్రాండ్ పునరుజ్జీవం పొందుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 87 ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం కొత్త యుగానికి నాంది” అని అన్నారు.
