ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల విస్తరణకు కొత్త ఊపు రానుంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ “భారత్ ఫోర్జ్”(Bharat Forge) రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఆ సంస్థ వైస్ చైర్మన్ “అమిత్ కల్యాణి”, విశాఖపట్నంలో ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు”ను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు అంశాలపై చర్చించారు.
షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచిన భారత్ ఫోర్జ్, పర్యాటక రంగంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా, గండికోట ప్రాంతంలో “రివర్ క్రూయిజ్ ప్రాజెక్టు”(River Cruise Project)చేపట్టేందుకు సంస్థ ఆసక్తి చూపింది.
ALSO READ:Forest land issue:అటవీ భూముల కబ్జాపై పవన్ కల్యాణ్ సీరియస్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. షిప్ బిల్డింగ్ రంగంలో తీరప్రాంత ప్రాధాన్యతను ఉపయోగించుకోవాలని సూచించారు.
అంతేకాకుండా, అరకు కాఫీ ఇప్పటికే గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగిందని పేర్కొని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను కూడా ప్రపంచ పర్యాటక పటంలో నిలబెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
