అమెరికాలోనూ కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై ఆందోళన

Kolkata: Doctors from dental colleges participate in a protest rally  against the rape and murder of a young medic at R G Kar Medical College  #Gallery

కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచార ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని క‌లచివేసింది. దీంతో బాధితురాలికి మద్దతుగా దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించి ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని అంద‌రూ డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.   

ఇదిలా వుంటే.. ఈ హత్యాచార ఘటనపై తాజాగా అమెరికాలోనూ పలువురు వైద్యులు ఆందోళన బాట‌ప‌ట్టారు. విధి నిర్వహణలో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్ట‌ర్‌కు న్యాయం జరిగేందుకు అంతా కలిసి రావాలంటూ ఈ సంద‌ర్భంగా వైద్యులు పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే వారు ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలను రక్షించాలని డాక్ట‌ర్లు నినదించారు. 

ఈ నిర‌స‌న‌ల్లో పాల్గొన్న‌వారిలో హ్యూస్టన్, టెక్సాస్ మెడికల్ సెంటర్‌కు చెందిన వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇండియాలో వైద్య శిక్షణ పొంద‌డం గ‌మ‌నార్హం. భారత్‌లోని ఆసుపత్రులలో వైద్యులపై హింసను అరికట్టడానికి, నిందితులను శిక్షించడానికి నిర్ణయాత్మక సమర్థవంతమైన చట్టం లేకపోవడంతోనే ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయని వారు తెలిపారు. ఏళ్లుగా అందరినీ ఈ స‌మ‌స్య‌ కలవరపెడుతోందన్నారు. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలకే రక్షణ‌లేకుంటే ఎలా? అని డాక్ట‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *