Wednesday, August 5, 2026
Chat on WhatsApp
HomeSportsIshan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్ రోల్!

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్ రోల్!

-

Chat on WhatsApp

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)”లో అసిస్టెంట్ మేనేజర్‌గా అధికారికంగా విధుల్లో చేరారు. క్రీడా కోటా ద్వారా ఈ ఉద్యోగాన్ని పొందిన ఇషాన్, పట్నాలోని RBI ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అక్కడ బ్యాంకు సిబ్బందితో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం ప్రకారం, అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఇషాన్ కిషన్‌కు నెలకు సుమారు రూ.1.22 లక్షల నుంచి రూ.1.24 లక్షల వరకు వేతనం లభించనుంది. పీఎఫ్, ఇతర కోతల అనంతరం చేతికి వచ్చే మొత్తం రూ.1.08 లక్షల నుంచి రూ.1.12 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

ఇక క్రికెట్ విషయానికి వస్తే, జాతీయ జట్టుకు దూరమైన తర్వాత దేశవాళీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శనతో ఇషాన్ మళ్లీ భారత జట్టులో చోటు సంపాదించారు. 2026 టీ20 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడిగా నిలిచిన ఆయన, అనంతరం ఐపీఎల్‌తో పాటు జింబాబ్వే సిరీస్‌లోనూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం భారత్ టెస్ట్ సిరీస్‌తో బిజీగా ఉండటంతో ఆయనకు కొంత విరామం లభించింది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ ద్వారా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించనున్న ఇషాన్ కిషన్, అంతకుముందు ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. క్రికెట్‌తో పాటు కొత్త ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh calls Deputy CM Pawan Kalyan the most handsome member of the Andhra Pradesh Cabinet.

Nara Lokesh | ‘మా కేబినెట్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ పవన్ అన్నే’.. లోకేశ్ వ్యాఖ్యలు వైరల్

Nara Lokesh: విశాఖపట్నంలో నిర్వహించిన పీ.వి. సింధు క్రీడా అకాడమీ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వేదికపైకి ఆహ్వానిస్తూ నిర్వాహకులు ఆయనను  "హ్యాండ్సమ్ మినిస్టర్"గా అభివర్ణించారు. అయితే...
- Advertisement -
Chat on WhatsApp