Jantar Mantar Protest: నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా జంతర్ మంతర్‌లో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక కేసులో ఊహించని పరిణామం వెలుగుచూసింది. బాలికపై ఫిర్యాదు చేసిన ఘజియాబాద్‌కు చెందిన స్మృతి సింగ్ తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. నిరసన సమయంలో ప్రధాని మోడీతో పాటు ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో స్మృతి సింగ్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన ఢిల్లీలో జరిగినందున పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు.
అయితే, తర్వాత మైనర్ బాలిక తన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పడం, తన తప్పును అంగీకరిస్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పిల్లలు తప్పులు చేయడం సహజమని, తమ తప్పును సరిదిద్దుకునే అవకాశం వారికి ఇవ్వాలని పేర్కొంటూ క్షమిస్తున్నట్లు ప్రకటించినట్లు వెల్లడైంది. ఈ పరిణామాల నేపథ్యంలో మైనర్ కుటుంబం కూడా విచారం వ్యక్తం చేయడంతో, కఠిన చర్యల కంటే మార్పుకు అవకాశం ఇవ్వడం మంచిదని భావించి తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని స్మృతి సింగ్ నిర్ణయించారు. దీంతో ఈ వ్యవహారం చట్టపరంగా కొత్త దశలోకి వెళ్లింది.
ALSO READ: Indian Stock Market | ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. లాభాల నుంచి నష్టాల్లోకి సెన్సెక్స్, నిఫ్టీ!








