NEET UG Counselling: నీట్-యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు కీలక అప్డేట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతోంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఆధ్వర్యంలో 15 శాతం అఖిల భారత కోటా (AIQ) కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుడుతుండగా, ఆగస్టు 13 నుంచి 85 శాతం రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రెండు కోటాల్లోనూ మూడు ప్రధాన రౌండ్లతో పాటు చివరగా స్ట్రే వెకెన్సీ రౌండ్ నిర్వహించి మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు ముందుగానే అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నీట్ ర్యాంకు, గత ఏడాది కటాఫ్‌లు, కళాశాలల ఫీజులు, బాండ్ నిబంధనలు, హాస్టల్ సౌకర్యాలు, కాలేజీ గుర్తింపు వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని చెబుతున్నారు. వెబ్ ఆప్షన్ల సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, అవకాశం రాదనే భావనతో మంచి కళాశాలలను వదిలేయకుండా అత్యంత ఇష్టమైన కాలేజీని మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేయాలని సూచిస్తున్నారు.
సీట్ల కేటాయింపు పూర్తిగా అభ్యర్థి ఇచ్చిన ప్రాధాన్యత క్రమం ఆధారంగానే జరుగుతుంది. AIQ, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ వేర్వేరు ప్రక్రియలు కావడంతో రెండింటికీ అర్హులైన వారు తప్పనిసరిగా రెండింటిలోనూ నమోదు చేసుకోవాలి. ప్రతి రౌండ్లో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉండటంతో సీటు రాకపోయినా తదుపరి రౌండ్లలో పాల్గొనడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: WhatsApp Account | మెసేజ్‌లు, కాల్స్ బంద్.. వాట్సాప్ అకౌంట్లు రివ్యూలోకి ఎందుకు వెళ్లాయి?








