Tuesday, August 4, 2026
Chat on WhatsApp
HomeNationalHigh Court  | అరెస్ట్ తర్వాత ఊరట.. ఉదయనిధి స్టాలిన్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

High Court  | అరెస్ట్ తర్వాత ఊరట.. ఉదయనిధి స్టాలిన్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

-

Chat on WhatsApp

High Court: తమిళనాడు డీఎంకే నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin)కు మద్రాస్ హైకోర్టులో కీలక ఊరట లభించింది. నటి త్రిషకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తంజావూరులో నమోదైన కేసు నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యను సవాల్ చేస్తూ ఉదయనిధి తరఫు న్యాయవాదులు అత్యవసరంగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, విచారణ నిమిత్తం అవసరమైన ప్రశ్నలు అడగవచ్చని, అయితే విచారణ పూర్తయిన వెంటనే ఉదయనిధిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి నిర్బంధ చర్యలు చేపట్టవద్దని హైకోర్టు పేర్కొంది.

కావేరి జలాల అంశంపై జరిగిన ఆందోళన సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించినవేనంటూ విమర్శలు రావడంతో ఈ వివాదం చెలరేగింది. అనంతరం నమోదైన కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. హైకోర్టు తాజా ఆదేశాలతో ఉదయనిధికి తాత్కాలిక ఉపశమనం లభించగా, కేసు తదుపరి విచారణపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

E20 Petrol Quality Check: Government Clarifies Fuel Standards and Safety Measures

E20 పెట్రోల్ సేఫేనా?.. కేంద్రం చెప్పిన కీలక విషయాలు ఇవే

E20 Petrol Quality Check: E20 పెట్రోల్‌పై నెలకొన్న అపోహలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు అందించే ఇంధనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చమురు సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని...
- Advertisement -
Chat on WhatsApp