Nara Lokesh: విశాఖపట్నంలో నిర్వహించిన పీ.వి. సింధు క్రీడా అకాడమీ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వేదికపైకి ఆహ్వానిస్తూ నిర్వాహకులు ఆయనను “హ్యాండ్సమ్ మినిస్టర్”గా అభివర్ణించారు. అయితే ఆ ప్రశంసలను తనవైపు తీసుకోకుండా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన, “మా కేబినెట్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నే” అని అన్నారు. లోకేశ్ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా చప్పట్లు మార్మోగాయి. ఆయన స్పందనకు హాజరైన వారు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అధికార కూటమి నేతల మధ్య పరస్పర గౌరవానికి ఇది నిదర్శనమంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ–జనసేన నేతల మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని మరోసారి చాటిచెప్పాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Nara Lokesh | ‘మా కేబినెట్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ పవన్ అన్నే’.. లోకేశ్ వ్యాఖ్యలు వైరల్
-








