Tuesday, August 4, 2026
Chat on WhatsApp
HomeNationalUdhayanidhi Stalin | ఉదయనిధి వ్యాఖ్యలు రాజకీయ దుమారం.. టీవీకే ఆగ్రహం, క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్

Udhayanidhi Stalin | ఉదయనిధి వ్యాఖ్యలు రాజకీయ దుమారం.. టీవీకే ఆగ్రహం, క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్

-

Chat on WhatsApp

Udhayanidhi Stalin: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. కావేరీ జలాల అంశంపై జరిగిన నిరసనలో డీఎంకే  నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. నటి త్రిష(Trisha) పేరును ప్రస్తావిస్తూ మాట్లాడారంటూ ఆరోపణలు రావడంతో, విజయ్ పార్టీ టీవీకే జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. అయితే తన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి కావని, కావేరీ జలాల అంశాన్నే ప్రస్తావించానని ఉదయనిధి అనంతరం స్పష్టీకరణ ఇచ్చారు. అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు.

నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం (TVK) ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. మహిళలను అవమానించేలా లేదా ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడటం ప్రజాప్రతినిధులకు తగదని పేర్కొంటూ జాతీయ మహిళా కమిషన్‌కు అధికారిక ఫిర్యాదు చేసింది. ఉదయనిధిపై తగిన చర్యలు తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అలాగే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాలని కోరింది. బీజేపీ నేతలు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తూ, డీఎంకే నాయకత్వం స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

E20 Petrol Quality Check: Government Clarifies Fuel Standards and Safety Measures

E20 పెట్రోల్ సేఫేనా?.. కేంద్రం చెప్పిన కీలక విషయాలు ఇవే

E20 Petrol Quality Check: E20 పెట్రోల్‌పై నెలకొన్న అపోహలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు అందించే ఇంధనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చమురు సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని...
- Advertisement -
Chat on WhatsApp