LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

HYDRAA | గచ్చిబౌలిలో ప్రమాదం పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్.. సీజ్ చేసినా మళ్లీ నిర్మాణం..?

by Bajaswamy
18 views

Gachibowli Building Collapse: హైదరాబాద్ గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటన అక్రమ నిర్మాణాలపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. అంజయ్యనగర్‌లో నాలాను ఆనుకుని కేవలం 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. కూలిన భవనం పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో సుమారు 10 ఫ్లాట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మహబత్, ఉమేష్ అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వీరు టైల్స్ పనుల కోసం అక్కడికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం శిథిలాల కింద మరెవరైనా చిక్కుకున్నారేమోనన్న అనుమానంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ శిథిలాలను తొలగిస్తూ గాలింపు కొనసాగించారు. భవనం కూలిన సమయంలో సమీపంలోని హాస్టల్ విద్యార్థులు, అపార్ట్‌మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. పరిసరాల్లోని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాజిద్ అనే బిల్డర్ నిర్మిస్తున్న హాస్టల్ భవనంపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సృజన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నిర్మాణాలపై నాలుగు నెలల క్రితమే ఫిర్యాదులు అందాయి. అధికారులు అప్పుడే పనులు నిలిపివేసి నిర్మాణాన్ని సీజ్ చేసినప్పటికీ, తాజాగా మళ్లీ పనులు ప్రారంభించారు. నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. భవనాన్ని 7 అంతస్తులతో పాటు పెంట్‌హౌస్ నిర్మాణానికి చేపట్టినట్లు తెలిపారు. పరిసరాల్లోనూ అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వాటిపై కూడా త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More