LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

KTR | రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

by Bajaswamy
0 views
KTR

KTR: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమయ్యాయి? ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందా? తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య హామీల అమలుపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు అభయ హస్తం పేరుతో కొత్త అర్థం చెబుతున్నారని విమర్శించారు. బడ్జెట్‌లో బీసీలకు లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించి, మూడేళ్లలో రూ.5 వేల కోట్లలోపే ఖర్చు చేశారని కేటీఆర్ ఆరోపించారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం వాటా కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ పేద కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 31 శాతం వాటా కల్పిస్తామన్న హామీలు కూడా అమలు కాలేదని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం  రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, ఇప్పటివరకు కేవలం పది వేల ఉద్యోగాలే భర్తీ చేశారని ఆరోపించారు. రాజీవ్ యువ వికాసం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు వంటి పథకాల అమలుపైనా నిలదీశారు. మొత్తానికి, కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలే లక్ష్యంగా కేటీఆర్ విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More