LIVE
Thursday, November 12, 2026
LIVE
LIVE

Station Ghanpur Car Fire | నడిరోడ్డుపై కారులో మంటలు.. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

by Bajaswamy
4 views
Station Ghanpur Car Fire

Station Ghanpur Car Fire: వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న అగ్నిప్రమాదం వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో జనగామ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డీజిల్ లీకేజీ కారణంగా ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కారును నిలిపివేశాడు. దీంతో కారులో ఉన్న ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. క్షణాల్లో మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More