LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

CM Revanth Reddy | హైదరాబాద్‌ను వరల్డ్ నాలెడ్జ్ హబ్‌గా మారుస్తాం: సీఎం రేవంత్

by Bajaswamy
18 views
CM Revanth Reddy meets Cambridge University professors during his London visit.

CM Revanth Reddy: లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిపై అంతర్జాతీయ విద్యా సంస్థలతో చర్చలు జరిపారు. ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీని సందర్శించిన ఆయన.. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికను వివరించారు. కేంబ్రిడ్జి బిజినెస్ స్కూల్‌లో ప్రొఫెసర్ గండికోట వెంకట్ శిరీష్, మార్కెటింగ్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, ఇతర విద్యావేత్తలతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణలో విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో ఉన్న అవకాశాలపై వారితో చర్చించారు. రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌ను కేవలం గ్లోబల్ సిటీగా కాకుండా ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. యువ పరిశోధకులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు నగరంలో ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

కేంబ్రిడ్జి వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని సీఎం ఆహ్వానించారు. విద్య, పరిశోధన, స్టార్టప్‌లు, పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని పెంచడం ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచ విజ్ఞాన పటంలో మరింత కీలక స్థానానికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

banner
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More