Telangana IPS Transfers 2026: తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు శాంతిభద్రతల పర్యవేక్షణను బలోపేతం చేసే దిశగా ఒకేసారి 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు GO Rt No.1654 ద్వారా ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ భారీ మార్పుల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పదవికి కొత్త అధికారి నియమితులయ్యారు. ఇప్పటివరకు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా వ్యవహరించిన మహేశ్ మురళీధర్ భగవత్‌కు నగర పోలీస్ బాస్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా నియమించారు. అదనంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ బాధ్యతలను కూడా ఆయనకు కేటాయించారు. మరోవైపు అకున్ సబర్వాల్‌కు రాష్ట్ర శాంతిభద్రతల అదనపు డీజీపీ బాధ్యతలు అప్పగించారు. కోఆర్డినేషన్, టెక్నికల్ సర్వీసెస్ విభాగాలను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు. మొత్తంగా లా అండ్ ఆర్డర్ నుంచి ఏసీబీ, సీఐడీ, ట్రాఫిక్, మహిళా భద్రత వరకు పలు కీలక విభాగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కొత్త నియామకాలతో తెలంగాణ పోలీస్ వ్యవస్థ పనితీరు ఏ మేరకు మెరుగుపడుతుందో వేచి చూడాలి.
ALSO READ: India U19 Asia Cup 2026 | సెమీస్‌లో ఆఫ్ఘనిస్థాన్ చిత్తు.. ఫైనల్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
