LIVE
Friday, November 13, 2026
LIVE
LIVE

Telangana 10+2 Education System | వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విధానం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

by Bajaswamy
5 views
Telangana 10+2 Education System

Telangana 10+2 Education System: తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థులకు పుస్తకాల చదువుతో పాటు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రత్యేక విద్యా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. 12వ తరగతి నుంచే నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థులను భవిష్యత్తు ఉపాధి అవకాశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి, ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు సూచించారు. కొత్త మార్పుల వల్ల ఏ ఒక్క విద్యార్థికీ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More