LIVE
Thursday, November 12, 2026
LIVE
LIVE

Sonia Gandhi Biopic | సోనియా గాంధీ జీవిత కథ సినిమాగా తీస్తా: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి

by Bajaswamy
2 views
Jagga Reddy announces plans to bring Sonia Gandhi's life story

Sonia Gandhi Biopic: రాజకీయాల్లో ఎన్నో కీలక మలుపులు.. మరెన్నో సంచలన నిర్ణయాలు.. వ్యక్తిగత జీవితంలో తీరని విషాదాలు.. ఇలా ఎన్నో అనుభవాలతో సాగిన సోనియా గాంధీ ప్రయాణం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి(Jagga Reddy) ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. సోనియా గాంధీ(Soniya Gandhi) రాసిన ఆత్మకథ ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన జగ్గారెడ్డి.. ఈ సినిమాలో తన పాత్ర కూడా ఉంటుందని తెలిపారు. గతంలో తాను అనుకున్న సొంత సినిమా ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కనపెట్టి, సోనియా గాంధీ జీవిత కథపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమా విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో పాటు మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకుంటానన్నారు. ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోకుండా, తన నియోజకవర్గంలోని కార్యకర్తల సహకారంతో సినిమాను నిర్మిస్తానని స్పష్టం చేశారు.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులని జగ్గారెడ్డి గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత సోనియా గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఆమె ఆ పదవిని స్వీకరించకుండా పీవీ నరసింహారావుకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. మూడుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా సోనియా గాంధీ తిరస్కరించారని కొనియాడారు. ఇలాంటి త్యాగాల వెనుక ఉన్న వ్యక్తిత్వాన్ని ప్రజలకు తెలియజేయాలన్నదే తన ఉద్దేశమన్నారు. అలాగే, సోనియా గాంధీపై ఆర్ఎస్ఎస్ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆమె ఆత్మకథ రాశారనే ఉద్దేశం సరికాదని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభించి, వచ్చే పుట్టినరోజు నాటికి విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. మరి సోనియా గాంధీ జీవితంలోని రాజకీయ, వ్యక్తిగత ఘట్టాలను ఈ సినిమా ఏ విధంగా చూపించబోతోందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More