LIVE
Saturday, November 14, 2026
LIVE
LIVE

TGPSC syllabus changes | TGPSC సిలబస్‌పై ఆందోళన వద్దు.. అభ్యర్థులకు కీలక ప్రకటన

by Bajaswamy
14 views
TGPSC issues clarification on syllabus changes for Telangana government job exams.

TGPSC syllabus changes: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో సిలబస్ మార్పులపై కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తెరదించింది. వివిధ నియామక పరీక్షల సిలబస్‌లో భారీ మార్పులు రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై కమిషన్ తాజాగా స్పష్టత ఇచ్చింది. అభ్యర్థులు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం సిలబస్ మార్పుల కోసం ఎలాంటి ప్రత్యేక కమిటీని TGPSC ఏర్పాటు చేయలేదని కమిషన్ వెల్లడించింది. ఒకవేళ భవిష్యత్‌లో సిలబస్‌లో పెద్దఎత్తున మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తే.. అభ్యర్థులకు కనీసం ఏడాది ముందుగానే సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది. అదే స్వల్పస్థాయి మార్పులు మాత్రమే ఉంటే.. సంబంధిత ఉద్యోగ నియామక నోటిఫికేషన్ జారీ చేసే సమయంలోనే కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది.

అభ్యర్థుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు సిలబస్‌పై జరుగుతున్న ప్రచారానికి స్పష్టత ఇవ్వడానికే ఈ ప్రకటన చేసినట్లు కమిషన్ తెలిపింది. దీంతో పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అనవసరమైన ఊహాగానాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే.. గత సిలబస్‌తో పోలిస్తే TGPSC కొత్త Paper-I సిలబస్‌లో మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పాత సిలబస్‌లో 11 అంశాలు ఉండగా.. కొత్త రూపకల్పనలో మొత్తం 15 అంశాలకు స్థానం కల్పించినట్లు సమాచారం. ముఖ్యంగా ఎకానమీ, పాలిటీ, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ డెమోగ్రఫీ, ఆధునిక భారత చరిత్ర వంటి అంశాలకు ప్రాధాన్యం లభించింది. దీంతో కేవలం పాత మెటీరియల్‌పైనే ఆధారపడి పరీక్షలకు సిద్ధమైతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనే చర్చ అభ్యర్థుల్లో కొనసాగింది. అయితే సిలబస్‌లో భారీ మార్పులు చేస్తే ముందుగానే తెలియజేస్తామని, స్వల్ప మార్పులు ఉంటే సంబంధిత నోటిఫికేషన్‌తో కొత్త సిలబస్‌ను విడుదల చేస్తామని TGPSC స్పష్టం చేయడంతో అభ్యర్థులకు కొంత స్పష్టత లభించింది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More