The Paradise censor cuts: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే ఆసక్తికర చర్చకు తెరలేపింది. సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తికాగా.. చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ లభించింది. అంతేకాదు, సెన్సార్ సూచనల మేరకు మొత్తం 21 మార్పులు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. సినిమాలోని హింస, రక్తపాతం, టార్చర్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. కొన్ని బూతు పదాలను మ్యూట్ చేయడంతో పాటు, కొన్ని డైలాగులను తొలగించారు. స్మోకింగ్‌కు సంబంధించిన హెచ్చరికలను చేర్చడంతో పాటు ఓ సిగరెట్ బ్రాండ్ ప్రస్తావనను కూడా తొలగించినట్లు సెన్సార్ వివరాలపై వచ్చిన రిపోర్టులు చెబుతున్నాయి.
ఇక రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రస్తావనలపైనా మార్పులు జరిగినట్లు సమాచారం. సినిమాలోని ఓ రాజకీయ నాయకుడి పేరును తొలగించినట్లు సెన్సార్ మార్పుల జాబితాను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. అలాగే కొన్ని రాజకీయ, చారిత్రక ప్రస్తావనలను కూడా మార్చడం లేదా మ్యూట్ చేయడం జరిగిందని సమాచారం. అయితే సినిమాలో ఎవరిని ఉద్దేశించి ఈ ప్రస్తావనలు ఉన్నాయనే విషయంపై చిత్రబృందం నుంచి పూర్తి అధికారిక వివరణ వెలువడలేదు. మొత్తం మార్పుల్లో భాగంగా దాదాపు 25 సెకన్ల కంటెంట్‌ను పూర్తిగా తొలగించగా.. మరో 1 నిమిషం 25 సెకన్ల దృశ్యాలను మార్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హింసాత్మక సన్నివేశాల తీవ్రతను తగ్గించేందుకు పలు చోట్ల విజువల్స్‌ను మోడిఫై చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్పుల అనంతరం ‘ది ప్యారడైజ్’ తుది నిడివి 2 గంటల 54 నిమిషాల 4 సెకన్లుగా ఖరారైనట్లు సమాచారం. అంటే దాదాపు మూడు గంటల నిడివితో ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ థియేటర్లలోకి రానుంది.
ALSO READ: Flipkart BBD Sale 2026 | Galaxy S25, S25 FEపై దసరా ఆఫర్లు.. రూ.80,999 ఫోన్.. ఇప్పుడు రూ.60 వేలలోపే!
