LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

Bathukamma Festival | తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరం.. 18న ట్యాంక్‌బండ్‌పై కనువిందు చేసే వేడుకలు

by Bajaswamy
10 views
Grand Bathukamma celebrations with women and cultural artists at Hyderabad Tank Bund

Bathukamma Festival: తెలంగాణ పల్లె సంస్కృతి, మహిళల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు రాష్ట్రం సిద్ధమవుతోంది. ఈ నెల 10 నుంచి 18 వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 18న సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై భారీ స్థాయిలో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరుతారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు జానపద కళారూపాలను ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొంటారు.

అనంతరం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద ప్రధాన వేడుకలు కొనసాగుతాయి. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. బతుకమ్మ సందడిని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ నమూనాలు, విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకూ ప్రత్యేక లైటింగ్ చేయాలని నిర్ణయించారు. ట్యాంక్‌బండ్‌కు వచ్చే మహిళలకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, క్యూలైన్లు, ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేయాలని GHMC, HMDA అధికారులను ఆదేశించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు వేడుకలు కొనసాగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్‌బండ్ వరకు విద్యుత్ వెలుగులతో అలంకరించనున్నారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More