LIVE
Friday, November 13, 2026
LIVE
LIVE

Fertiliser Subsidy 2026 | రైతులకు మోడీ సర్కార్ తీపికబురు.. రబీ సీజన్‌కు భారీ నిధులు

by Bajaswamy
7 views
Union Cabinet Decisions Rabi Season Subsidy

Fertiliser Subsidy 2026: రైతులకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, మౌలిక వసతులు, పర్యాటక రంగాలకు సంబంధించి పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ముఖ్యంగా రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేందుకు కేంద్రం భారీ నిధులు కేటాయించింది. మొత్తం రూ.62,370 కోట్ల విలువైన ఎరువుల సబ్సిడీని అందించాలని నిర్ణయించింది. దీంతో సాగు సమయంలో రైతులపై ఎరువుల ధరల భారం తగ్గనుంది. ఈ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. యువతలో వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించేందుకు ముద్ర యోజన కింద రూ.5 వేల కోట్ల రుణాలు అందించనున్నారు. అలాగే స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.4,111 కోట్ల క్రెడిట్ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా నోయిడా, గ్రేటర్ నోయిడాలను అనుసంధానిస్తూ 8.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు భారతదేశ చరిత్ర, సంస్కృతి, నాగరికత విశిష్టతను ప్రతిబింబించేలా ‘యుగే యుగీన్ భారత్ మ్యూజియం’ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. సుమారు రూ.3,230 కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీలోని చారిత్రక నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాల్లో ఈ మ్యూజియాన్ని నిర్మించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా తీర్చిదిద్దాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే అక్కడి ప్రభుత్వ కార్యాలయాలను కర్తవ్య భవన్, సేవా తీర్థ్ ప్రాంతాలకు తరలించారు. పాత భవనాల నిర్మాణ శైలికి ఎలాంటి నష్టం కలగకుండా వాటి చారిత్రక ప్రత్యేకతను కాపాడుతూ మ్యూజియం పనులు చేపట్టాలని కేంద్రం సూచించింది. సందర్శకుల సౌకర్యార్థం సమీపంలో మెట్రో స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More