LIVE
Friday, November 13, 2026
LIVE
LIVE

Jagdeep Dhankhar Health | మాజీ ఉపరాష్ట్రపతికి తీవ్ర అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

by Bajaswamy
4 views
Jagdeep Dhankhar Health News

Jagdeep Dhankhar Health: ఉదయం ప్రశాంతంగా సాగుతున్న వేళ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రోజువారీ వ్యాయామంలో భాగంగా మార్నింగ్ వాక్‌కు వెళ్లిన భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (75) అకస్మాత్తుగా కుప్పకూలడంతో కలకలం రేగింది. ఆయన స్పృహ కోల్పోవడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఢిల్లీలో ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ధన్‌ఖడ్ ఒక్కసారిగా కిందపడిపోయారు. కొద్దిసేపటి వరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను పీసీఆర్ వాహనంలో నివాసానికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఐఎల్బీఎస్ వైద్య బృందంతో పాటు ఎయిమ్స్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ సేథ్ ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌కు తరలించాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఎయిమ్స్ కార్డియో-న్యూరో సెంటర్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం కార్డియాలజీ విభాగానికి చెందిన నిపుణుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుండగా, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో రాజకీయ, అధికార వర్గాల్లో ఆందోళన నెలకొంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More