LIVE
Saturday, November 14, 2026
LIVE
LIVE

Kulgam Terror Attack | కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు

by Bajaswamy
7 views
Kulgam Terror Attack

Kulgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపాయి. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. బైక్‌పై వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. అధికారుల వివరాల ప్రకారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో కుల్గాం జిల్లాలోని అఖ్రాన్ సమీపంలో ఈ దాడి జరిగింది. చెక్‌పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందిపై మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. ఈ దాడిలో గాయపడిన ముగ్గురు జవాన్లను వెంటనే అనంతనాగ్ జిల్లాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న భద్రతా అధికారులు వెంటనే అదనపు బలగాలను ఘటనాస్థలికి పంపించారు. పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దుండగుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుల్గాం జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More