Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadతెలంగాణ ఓటర్లకు అలర్ట్...తెలంగాణలో త్వరలో SIR అమలు?

తెలంగాణ ఓటర్లకు అలర్ట్…తెలంగాణలో త్వరలో SIR అమలు?

-

Chat on WhatsApp

SIR in Telangana: తెలంగాణలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) త్వరలో అమలు చేసే యోచనలో ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ సంకేతాలు ఇచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కీలకమని ఆయన పేర్కొన్నారు.

SIR ప్రక్రియలో గణన దశలో ఓటర్లు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే ఓటరు మ్యాపింగ్ లేదా నిర్ధారణలో సమస్యలు ఎదురైతే మాత్రమే గుర్తింపు పత్రాలు అడిగే అవకాశం ఉంది. గత SIRలో ఇచ్చిన వివరాలు లేదా బంధువుల సమాచారం ఉంటే మ్యాపింగ్ సులభమవుతుంది.

కొన్ని సందర్భాల్లో ఓటర్లు తమ తండ్రి, తల్లి, తాత, అమ్మమ్మ వంటి బంధువుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. జాబితాలో పేరు లేదా సంబంధిత సమాచారం లేకపోతే, ఎన్నికల అధికారులు 11 రకాల గుర్తింపు పత్రాలలో ఒకదాన్ని సమర్పించమని సూచిస్తారు.

జూలై 1, 1987కి ముందు జన్మించిన వారు తమ వ్యక్తిగత పత్రాలను ఇవ్వాలి. 1987 తర్వాత, 2004 డిసెంబర్ 2కి ముందు జన్మించిన వారు తమతో పాటు తల్లి లేదా తండ్రి పత్రాన్ని సమర్పించాలి. 2004 తర్వాత జన్మించిన ఓటర్లు తల్లిదండ్రులిద్దరి పత్రాలను అందించాల్సి ఉంటుంది. SIR అమలులో స్పష్టత కోసం అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ:Republic Day 2026: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian chess Grandmaster Praggnanandhaa

Praggnanandhaa | 20 ఏళ్ల వయసులో అరుదైన ఘనత..  ప్రజ్ఞానంద ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్!

Praggnanandhaa: చదరంగ ప్రపంచంలో మరోసారి భారత జెండాను రెపరెపలాడించాడు యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద. కేవలం 20 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుతూ మరో ప్రతిష్టాత్మక విజయాన్ని అందుకున్నాడు. అమెరికాలో...
- Advertisement -
Chat on WhatsApp