LIVE
Monday, November 16, 2026
LIVE
LIVE

Supreme Court | మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Bajaswamy
8 views
Supreme Court

Supreme Court: మత మార్పిడి.. కుల హోదా.. రిజర్వేషన్లు! ఈ మూడింటి మధ్య సంబంధంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. గతంలో ఉన్న కుల హోదాను ఆధారంగా చేసుకుని, మతం మారిన తర్వాత కూడా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ప్రయోజనాలను కోరలేరని స్పష్టం చేసింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. హిందూ సామాజిక వ్యవస్థ నుంచి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు, గతంలో ఎదుర్కొన్న సామాజిక వెనుకబాటుతనాన్ని మాత్రమే ప్రాతిపదికగా చేసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద రిజర్వేషన్లు కోరలేరని పేర్కొంది.

1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వుల ప్రకారం, ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన అర్హులకే వర్తిస్తుందని ధర్మాసనం గుర్తుచేసింది. ఆ ఉత్తర్వుల్లో పేర్కొనని మతాన్ని స్వీకరించినప్పుడు పూర్వపు ఎస్సీ హోదా కొనసాగదని తెలిపింది. తిరిగి హిందూ మతంలోకి వచ్చినంత మాత్రాన గతంలో ఉన్న రిజర్వేషన్ హోదా ఆటోమేటిక్‌గా పునరుద్ధరణ కాదని స్పష్టం చేసింది. ఈ వివాదానికి కారణం 2024 మార్చి 9న తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు. బీసీ, ఎంబీసీ, డీనోటిఫైడ్ కమ్యూనిటీలు, ఎస్సీల నుంచి ఇస్లాంలోకి మారినవారిని వెనుకబడిన తరగతుల ముస్లింలుగా గుర్తించే వెసులుబాటును ఆ ఉత్తర్వు కల్పించింది.

2015లో ఇస్లాంలోకి మారిన సమీర్ అహ్మద్ (గతంలో పరమశివం) తనకు ముస్లిం లెబ్బై కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరగా, అధికారులు తిరస్కరించారు. అయితే గతంలో జరిగిన సంఘటన ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ వివాదం వెలుగుచూసింది. ప్రభుత్వ ఉత్తర్వును మద్రాస్ హైకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొనగా, తాజాగా సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. మొత్తానికి, మత మార్పిడి తర్వాత రిజర్వేషన్ అర్హతను నిర్ణయించడంలో గత కుల హోదా ఒక్కటే సరిపోదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది.

banner
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More