టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రోహిత్ స్పందించి తనను కలవలేకపోయానని బాధపడుతున్న తీరు ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఆ వీడియోలో యువతి రోహిత్ శర్మను కలుసుకునే అవకాశం దక్కలేదని భావోద్వేగానికి లోనైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండగా, అది చివరకు రోహిత్ దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన ఆయన, అభిమాని దీపక్ సహాయంతో ఆ యువతికి ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు.
రోహిత్ నుంచి వ్యక్తిగత వీడియో సందేశం రావడంతో ఆ యువతి ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన అభిమాన క్రికెటర్ నుంచి ప్రత్యేక స్పందన రావడంతో ఆమె భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోహిత్ శర్మ అభిమానుల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయత మరోసారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. “ఇదే నిజమైన స్టార్‌డమ్” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.








