Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeSportsDavid Warner | పాకిస్థాన్ సూపర్ లీగ్ కు షాక్... డేవిడ్ వార్నర్ అరెస్ట్

David Warner | పాకిస్థాన్ సూపర్ లీగ్ కు షాక్… డేవిడ్ వార్నర్ అరెస్ట్

-

Chat on WhatsApp

David Warner: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మద్యం మత్తులో కారు నడిపిన కేసులో చిక్కుకున్నారు. సిడ్నీలోని మరౌబ్రా ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన సాధారణ శ్వాస పరీక్షలో ఆయన కారును ఆపగా, మొదటి పరీక్షలోనే మద్యం సేవించినట్లు తేలినట్లు సమాచారం.

అనంతరం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన రెండో పరీక్షలో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇది అనుమతించిన పరిమితికి దాదాపు రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో ఆయనపై మద్యం మత్తులో వాహనం నడిపిన కేసు నమోదు చేసి, కోర్టుకు హాజరుకావాలంటూ నోటీసు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తనిఖీ కేంద్రానికి చేరుకునేలోపే వార్నర్ వాహనాన్ని ఆపి పార్క్ చేసినట్లు అనుమానం వ్యక్తమైంది. దీంతో అధికారులు వాహనాన్ని పరిశీలించి పరీక్షలు నిర్వహించారు.

అనంతరం ఆయనను మరౌబ్రా పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. తర్వాత వ్యక్తిగత షూరిటీపై విడుదల చేసినట్లు సమాచారం. ఈ కేసులో భాగంగా మే 7, 2026న సిడ్నీ డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో వార్నర్ హాజరుకావాల్సి ఉంది.

కేసు తీవ్రతను బట్టి ఆయనకు జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ వంటి చర్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.

ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్, మ్యాచ్‌ల మధ్య విరామం దొరకడంతో సిడ్నీకి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయినప్పటికీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇంకా యాక్టివ్‌గా ఉన్న వార్నర్ ఇలా వివాదంలో చిక్కుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.

ఒకవైపు మైదానంలో జట్టును నడిపిస్తుండగా, మరోవైపు ఈ న్యాయపరమైన వివాదం ఆయన ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కోర్టు విచారణపైనే ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp