LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

CM Chandrababu Naidu | 45 ఏళ్ల రాజకీయ అనుభవం.. ప్రజల సంక్షేమమే నా లక్ష్యం: చంద్రబాబు

by Bajaswamy
22 views
Chandrababu Naidu addressing a public meeting in Mogalthuru

CM Chandrababu Naidu: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నరసాపురం ప్రాంతానికి ఎన్నోసార్లు వచ్చానని, ప్రజలకు ఉపయోగపడే అనేక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం తీవ్రంగా దెబ్బతిందని సీఎం విమర్శించారు. ఆ పరిస్థితుల నుంచి కూటమికి ప్రజలు భారీ మెజార్టీతో అధికారం అప్పగించారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామని, దీపం పథకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు అందించామని చెప్పారు.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చంద్రబాబు అన్నారు. ఇప్పటివరకు రూ.75,503 కోట్ల మేర పెన్షన్లు అందించామని, ఆ మొత్తంతో మూడు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చని వ్యాఖ్యానించారు. ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో రాష్ట్రానికి ఎలక్ట్రిక్‌, ఏసీ బస్సులు అందుబాటులోకి వస్తాయని, మహిళలు వాటిని నడిపేలా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లు కల్పిస్తామని తెలిపారు. ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ ఉత్పత్తి చేసి భవిష్యత్‌లో ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ‘వన్ హౌస్–వన్ ఆంత్రప్రెన్యూర్’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన లక్ష్యాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More