LIVE
Saturday, November 14, 2026
LIVE
LIVE

AP High Court | రాప్తాడు నిందితుడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

by Bajaswamy
4 views
AP High Court on Rapthadu chainsaw attack case

AP High Court: రాప్తాడు చైన్‌సా దాడి కేసు మరో కీలక మలుపు తిరిగింది. పోలీసుల కాల్పుల్లో గాయపడి కుడి కాలును కోల్పోయిన నిందితుడి విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలగించిన కాలును భద్రపరచాలని అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అధికారులను ఆదేశించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అతను కాలును భద్రపరిచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు పోలీసులకు స్పష్టం చేసింది. పోలీసుల కాల్పుల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మంగళగిరికి చెందిన న్యాయవాది దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్లు సమర్పించాలని సూచిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More