LIVE
Friday, November 13, 2026
LIVE
LIVE

Assam Train Accident | అస్సాంలో రైలు బీభత్సం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్

by Bajaswamy
4 views
Kolkata-Sairang Express Train Accident

Assam Train Accident: అస్సాంలో ఉదయాన్నే రైలు ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వేగంగా వెళ్తున్న కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో ఇంజన్‌తో పాటు ఆరు నుంచి ఏడు బోగీలు పట్టాలు తప్పినట్లు ప్రాథమిక సమాచారం. అస్సాంలోని కామరూప్ జిల్లా దిగారు రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 6.54 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన జరిగిన వెంటనే ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు, సహాయక సిబ్బంది అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను రైలు నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సీపీఆర్‌వో కపింజల్ కిషోర్ శర్మ వెల్లడించారు. అయితే కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. మరోవైపు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించే పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More