AP SSC Supply Results 2026: ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా విడుదల చేశారు. ఆన్‌లైన్ వేదికగా ఫలితాలను ప్రకటించడంతో విద్యార్థులు తమ మార్కులను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మే 25 నుంచి జూన్ 4 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సుమారు 90 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించేందుకు ఈ పరీక్షలను నిర్వహించారు.