Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeNationalVB-G RAM G | గ్రామీణ ఉపాధికి కొత్త ఊపు... కేంద్రం ‘VB-G RAM G’...

VB-G RAM G | గ్రామీణ ఉపాధికి కొత్త ఊపు… కేంద్రం ‘VB-G RAM G’ పథకం ప్రారంభం

-

Chat on WhatsApp

గ్రామాల్లో అభివృద్ధి పనులు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రారంభించింది. ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (VB-G RAM G)’ అనే పేరుతో రూపొందించిన ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

ఈ కొత్త మిషన్ కింద మొత్తం 318 రకాల పనుల జాబితాను కేంద్రం అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపించడంతో పాటు అవసరమైన నిధుల కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం మాత్రమే కాకుండా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సహజ వనరుల సంరక్షణ, జీవనాధార మార్గాల విస్తరణ, అలాగే విపత్తుల నిర్వహణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ పథక ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.

జల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ కాలువల నిర్మాణం, చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, రీఛార్జ్ పిట్లు, బావుల పునరుద్ధరణ వంటి పనులను ఇందులో చేర్చారు. వర్షపు నీటి నిర్వహణకు సంబంధించిన మౌలిక పనులు కూడా విస్తృతంగా అమలు చేయనున్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల విభాగంలో పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల అదనపు గదులు, ప్రయోగశాలలు, ప్రజా మరుగుదొడ్లు, రహదారులు, కల్వర్టులు, శ్మశానవాటికలు, మార్కెట్ యార్డులు వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు.

జీవనోపాధి రంగంలో వ్యవసాయం, పశుపోషణ, చేపల పెంపకం, కుటీర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే విపత్తుల నిర్వహణ విభాగంలో వరద రక్షణ గోడలు, గట్ల నిర్మాణం, నేల స్థిరీకరణ పనులు, అడవి సంరక్షణ చర్యలు, అగ్నిప్రమాద నియంత్రణ చర్యలు వంటి పనులు కూడా ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధి సాధించడమే ఈ కొత్త కేంద్ర పథక లక్ష్యంగా ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp