Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaSIR | సర్-2026’ ప్రక్రియపై అపోహలు వద్దు.. తెలంగాణ ఓటరు జాబితాపై కీలక అప్‌డేట్

SIR | సర్-2026’ ప్రక్రియపై అపోహలు వద్దు.. తెలంగాణ ఓటరు జాబితాపై కీలక అప్‌డేట్

-

Chat on WhatsApp

తెలంగాణలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. (SIR)స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026 కార్యక్రమాన్ని పూర్తిస్థాయి పారదర్శకతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి(Sudarshan Reddy) అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఓటరు నమోదుకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పలు వార్తలు వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన వారందరికీ నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కల్పిస్తామని, ప్రజలు అపోహలకు దూరంగా ఉండాలని కోరారు.

కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25వ తేదీ నుంచి బూత్ లెవల్ అధికారులు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారు. అందిన ఫారాలను జులై 25లోపు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అర్హత కలిగిన కొత్త ఓటర్లు కూడా ఇదే ప్రక్రియ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల మ్యాపింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో గణనీయమైన పురోగతి సాధించామని వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పత్రాలను కూడా పరిశీలనలో పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. గతంలో నమోదు ప్రక్రియలో భాగమైన వారికి అదనపు ధ్రువపత్రాల అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అప్పటి వరకు ఎన్నికల సంఘం నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం అన్ని దశలను సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాజకీయ పార్టీలతో సమన్వయం కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు వెల్లడించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp