Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeSportsIndia vs Afghanistan | రోహిత్ క్యాచ్‌లు.. ప్రసిద్ధ్ వికెట్లు.. చెన్నైలో చెలరేగిన ప్రసిద్ధ్ కృష్ణ

India vs Afghanistan | రోహిత్ క్యాచ్‌లు.. ప్రసిద్ధ్ వికెట్లు.. చెన్నైలో చెలరేగిన ప్రసిద్ధ్ కృష్ణ

-

Chat on WhatsApp

India vs Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. తన తొలి స్పెల్‌లోనే ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేసిన ప్రసిద్ధ్, కేవలం ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. గుర్బాజ్, జర్దాన్, రహ్మత్ షా, రసూలీలను పెవిలియన్‌కు పంపించి ఆఫ్ఘనిస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.

చెన్నై పిచ్‌పై లభించిన బౌన్స్‌ను సమర్థంగా వినియోగించుకున్న ఈ భారత పేసర్, బ్యాటర్లకు ఎలాంటి అవకాశమివ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మరోవైపు స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన రోహిత్ శర్మ కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వచ్చిన తొలి మూడు అవకాశాలను చక్కగా అందిపుచ్చుకుని జట్టు విజయావకాశాలను మరింత బలపరిచాడు.

ప్రారంభ వికెట్లు వరుసగా కోల్పోయిన ఆఫ్ఘనిస్థాన్ కష్టాల్లో పడింది. 31 ఓవర్లు ముగిసేసరికి ఐదు మంది బ్యాటర్లు పెవిలియన్ చేరగా, ఆఫ్ఘనిస్థాన్ స్కోరు152 పరుగుల వద్ద నిలిచింది. ప్రస్తుతం హష్మతుల్లా షాహిది, మహమ్మద్ నాభి క్రీజులో ఉండి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత ప్రదర్శనతో భారత్ మ్యాచ్‌పై ఆధిపత్యం చెలాయించే దిశగా అడుగులు వేస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp