Wednesday, August 5, 2026
Chat on WhatsApp
HomeTelanganaCM Revanth Reddy | ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీలు

CM Revanth Reddy | ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీలు

-

Chat on WhatsApp

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపారు. ముందుగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసిన సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పర్యావరణ అనుమతులు, అటవీ సంరక్షణ, ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలో చేపడుతున్న ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు. అనంతరం కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి, గౌరవెల్లి వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని మహారాష్ట్రతో చర్చలకు సహకరించాలని కోరారు.

గ్రావిటీ ఆధారంగా నీటి సరఫరా సాధ్యాసాధ్యాలను వివరిస్తూ 150 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం లభిస్తే తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp