Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeTelanganaTelangana School Uniform | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్త యూనిఫాం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana School Uniform | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్త యూనిఫాం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

-

Chat on WhatsApp

Telangana School Uniform: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంల విషయంలో కీలక మార్పులు ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త డ్రెస్ కోడ్‌ను అమలు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు మరింత ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉండే విధంగా యూనిఫాం డిజైన్‌లో పలు మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

వేసవి సెలవుల అనంతరం ఈ నెల 15వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండగా, ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే కొత్త యూనిఫాంలు విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది అందించిన యూనిఫాంలపై వచ్చిన అభిప్రాయాలు, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈసారి డిజైన్‌ను పూర్తిగా మార్చినట్లు సమాచారం. కొత్త డిజైన్ ప్రకారం బాలురకు లైట్ బ్లూ రంగు షర్టులు, డార్క్ బ్లూ రంగు ప్యాంట్లు అందించనున్నారు.

అదే విధంగా బాలికలకు లైట్ బ్లూ టాప్స్‌తో పాటు డార్క్ బ్లూ చుడీదార్లు మరియు స్కర్ట్లు ఉండనున్నాయి. యూనిఫాం రూపకల్పనలో రంగుల సమతౌల్యం మరియు ఆకర్షణీయతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా ప్రత్యేకతగా బాలుర షర్టుల ముందు జేబు మరియు చేతులపై డార్క్ బ్లూ పట్టీలు ఏర్పాటు చేయనున్నారు. బాలికల పంజాబీ డ్రెస్సుల్లో కూడా చేతుల భాగం మరియు వెయిస్ట్ కోట్ ప్రాంతంలో అదే రంగు పట్టీలు ఉండేలా డిజైన్ చేశారు.

విద్యార్థులకు మెరుగైన రూపంలో, ఆధునిక శైలిలో యూనిఫాంలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఆరో, ఏడో తరగతి చదివే బాలురకు ప్యాంట్లు తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Newly discovered Croton Ubbalamadugensis plant species in the Eastern Ghats

Pawan Kalyan | తిరుపతిలో గుర్తించిన అరుదైన మొక్కకు పేరు పెట్టిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో మరో అరుదైన వృక్షజాతి వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లో గుర్తించిన కొత్త మొక్కకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ "క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్"...
- Advertisement -
Chat on WhatsApp