Rajendranagar: హైదరాబాద్ PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కారు అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. మెహదీపట్నం వైపు వెళ్తున్న ఓ కారులో ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 278 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం గమనించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. మంటలు మరింత వ్యాపించకముందే అప్రమత్తంగా వ్యవహరించి వాటిని అదుపులోకి తీసుకొచ్చారు.
పోలీసుల సత్వర చర్యలతో కారులో ఉన్నవారు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడగా, అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులకు కూడా ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినప్పటికీ, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవడంతో రాకపోకలు సాధారణ స్థితికి వచ్చాయి. సమయానికి స్పందించిన ట్రాఫిక్ సిబ్బంది పెద్ద ప్రమాదాన్ని నివారించారని స్థానికులు అభినందించారు.








