Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeTelanganaCM Revanth Reddy | పవన్ సభకు అనుమతి రద్దుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్...

CM Revanth Reddy | పవన్ సభకు అనుమతి రద్దుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

-

Chat on WhatsApp

CM Revanth Reddy: తెలంగాణ రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ఎవరికైనా రాజకీయాలు చేసే హక్కు ఉందని అన్నారు.

జూన్ 2న పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై వస్తున్న విమర్శలకు సీఎం సమాధానం ఇచ్చారు. ఈ నిర్ణయం పూర్తిగా శాంతి భద్రతల పరిరక్షణ కోణంలో తీసుకున్నదేనని, దీనిలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు ప్రతి నాయకుడికీ సమాన అవకాశాలు ఉంటాయని తెలిపారు. పవన్ కల్యాణ్ కొన్ని అంశాలపై ప్రశ్నలు లేవనెత్తగా, వాటికి మంత్రిగా తాను సమాధానం ఇచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఎవరు వచ్చినా రాజకీయాలు చేసుకోవచ్చని, ప్రజాస్వామ్యంలో పోటీకి పూర్తి స్వేచ్ఛ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, “ఓట్ల చోరీ తరువాత ఇప్పుడు సీట్ల చోరీ జరుగుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను ఆయన ప్రశ్నిస్తూ, ఇది కుట్రపూరిత చర్య అని ఆరోపించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp