Ponnam Prabhakar: గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక భక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించినట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిసి జలవనరులు నిండాలని, రైతులకు పంటలు ఆశాజనకంగా పండాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆంజనేయస్వామిని కోరుకున్నట్లు తెలిపారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని పేర్కొన్న ఆయన, స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గురుపూర్ణిమ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.








