LIVE
Saturday, November 14, 2026
LIVE
LIVE

Telangana Assembly | స్పీకర్ వర్సెస్ హరీష్.. మాటల యుద్ధంతో దద్దరిల్లిన అసెంబ్లీ, 15 నిమిషాలు వాయిదా

by Bajaswamy
9 views
Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు తీవ్ర వాగ్వాదాలతో వేడెక్కాయి. మొదటి రోజు అసెంబ్లీ వెలుపల చోటుచేసుకున్న పరిణామాలు సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. స్పీకర్‌పై తాతా మధు(Thatha Madhu) చేశారనే వ్యాఖ్యల అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందిస్తూ.. తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు భావిస్తే, తాతా మధు ఇప్పటికే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని లిఖితపూర్వకంగా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ అంశాన్ని మరింత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.

అదే సమయంలో అసెంబ్లీ బయట జరిగిన పరిణామాలపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. మహిళా ఎమ్మెల్యేలు సునీతపై దాడి చేయడం, సబితా ఇంద్రారెడ్డి మెడ పట్టుకోవడం వంటి ఘటనలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. ఘటనలపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళా శాసనసభ్యులంటే తనకు, సభకు పూర్తి గౌరవం ఉందన్నారు. అయితే, తనపై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని స్పీకర్ ప్రశ్నించారు. తన తల్లిని దూషించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ వ్యాఖ్యలపై తనకు ఆవేశం రావడం సహజమని, మరి హరీష్ రావు ఎందుకు అంత ఆవేశపడుతున్నారని నిలదీశారు. దీంతో సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. పరిస్థితి అదుపు తప్పడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More