Sunday, July 5, 2026
Chat on WhatsApp
HomeNationalTVK Government | ఇది బలహీనమైన ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు...డీఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

TVK Government | ఇది బలహీనమైన ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు…డీఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం(TVK government) గురించి డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి M.K స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. విజయ్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, పూర్తి స్థాయి మద్దతు లేక అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నందున ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

డీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన M.K.స్టాలిన్, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎప్పుడైనా అసెంబ్లీ పరిణామాలు మారే అవకాశం ఉందని, అందువల్ల ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మిత్రపక్షాల మద్దతు తగ్గినా లేదా రాజకీయ అనిశ్చితి ఏర్పడినా ప్రభుత్వ స్థిరత్వం ప్రభావితమవుతుందని ఆయన పేర్కొన్నారు.

అలాగే గతంలో ఎదురైన ఎన్నికల పరాజయాల నుంచి డీఎంకే ఎలా పుంజుకుందో గుర్తు చేస్తూ, భవిష్యత్తులో మళ్లీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. “తమిళనాడులో డీఎంకే సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు” అని వ్యాఖ్యానిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

సోషల్ మీడియా రాజకీయ ప్రభావంపై కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ, విమర్శలను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రస్తుతం రాజకీయ చర్చలు సోషల్ మీడియా వేదికలపై ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral controversial book cover seen in hyderabad metro sparks social media debate

Social Media | మెట్రోలో వైరల్ బుక్ కవర్.. ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ ఫొటోపై...

Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తరచూ కొత్త చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు చదువుతున్నట్లు కనిపించిన రెండు పుస్తకాల కవర్లు నెట్టింట హాట్ టాపిక్‌గా...
- Advertisement -
Chat on WhatsApp