HomeEducation NewsRRB Railway Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌ | రైల్వే ఉద్యోగాలకు చివరి అవకాశం

RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌ | రైల్వే ఉద్యోగాలకు చివరి అవకాశం

-

Chat on WhatsApp

RRB Railway Jobs 2026: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 2025 సంవత్సరానికి సంబంధించిన ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 312 ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీ జరగనుంది.

ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా, మరో రెండు రోజుల్లో అప్లికేషన్ గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు జనవరి 29, 2026 రాత్రి 11.59 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని RRB సూచించింది.

ఈ నోటిఫికేషన్‌లో చీఫ్ లా అసిస్టెంట్ (22), పబ్లిక్ ప్రాసిక్యూటర్ (7), జూనియర్ ట్రాన్స్‌లేటర్ (202), సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ (15), స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ (24), సైంటిఫిక్ అసిస్టెంట్/ట్రైనింగ్ (2), ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3 (39), సైంటిఫిక్ సూపర్వైజర్ (1) పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలను అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్ సహా వివిధ RRB రీజియన్లలో భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్‌, లా డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, MBA, మాస్టర్స్ డిగ్రీ అర్హతలు అవసరం. జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి.

జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500 కాగా, SC/ST/EBC/మైనారిటీ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు. సింగిల్ స్టేజ్ CBT, ట్రాన్స్‌లేషన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.19,000 నుంచి రూ.44,900 వరకు జీతం చెల్లిస్తారు.

ALSO READ:Devara 2 పై తాజా అప్‌డేట్.. త్వరలో షూటింగ్…రిలీజ్ మాత్రం ?

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp