Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeNationalBank Holidays | జూన్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు సెలవులు ? .. ఏఏ రోజుల్లో...

Bank Holidays | జూన్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు సెలవులు ? .. ఏఏ రోజుల్లో అంటే?

-

Chat on WhatsApp

Bank holidays: జూన్ నెలలో బ్యాంకు వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు, ప్రాంతీయ పండుగలు మరియు స్థానిక వేడుకల ఆధారంగా మారుతాయి. వారపు సెలవుల ప్రకారం జూన్ 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

అలాగే జూన్ 13 రెండవ శనివారం, జూన్ 27 నాల్గవ శనివారం కారణంగా బ్యాంకులు పనిచేయవు. ఇవి కాకుండా కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి.జూన్ 15న యంగ్ మిజో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్‌లోని బ్యాంకులు పనిచేయవు. జూన్ 25, 26 తేదీల్లో మొహర్రం పండుగ కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇందులో హైదరాబాద్ సహా అనేక ప్రధాన నగరాలు కూడా ఉన్నాయి.

జూన్ 29న సంత్ గురు కబీర్ జయంతి కారణంగా సిమ్లాలో బ్యాంకులు పనిచేయవు. జూన్ 30న రెమ్నా నీ కారణంగా ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతున్నప్పటికీ, బ్యాంకు శాఖలు మూసి ఉండే ఈ రోజుల్లో వినియోగదారులు ముందుగానే తమ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Hitech City Railway Station inaugurated under Amrit Bharat Station Scheme

Hitech City | ఇక హైటెక్ సిటీ జర్నీ మరింత హైటెక్.. హైటెక్ సిటీ...

హైదరాబాద్‌లో ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌(Hitech City Railway Station)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం...
- Advertisement -
Chat on WhatsApp