Home Education NewsRRB GROUP D అభ్యర్థులకు షాక్….అప్లికేషన్ల తేదీలో మార్పు 

RRB GROUP D అభ్యర్థులకు షాక్….అప్లికేషన్ల తేదీలో మార్పు 

by Bajaswamy
rrb group d recruitment 2026 notification update

RRB GROUP D 2026: రైల్వే గ్రూప్ డి రిక్రూట్‌మెంట్ 2026 కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కీలక అప్‌డేట్ వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా విడుదల చేసిన సవరించిన నోటిఫికేషన్ ప్రకారం, 22,000 గ్రూప్ డి లెవల్–1 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది.

మొదట జనవరి 21న ప్రారంభం కావాల్సిన అప్లికేషన్లు ఇప్పుడు “జనవరి 31, 2026” నుంచి ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ “మార్చి 2, 2026″గా నిర్ణయించారు.

ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ రైల్వే విభాగాల్లో ఖాళీగా ఉన్న 22,000 గ్రూప్ డి పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుంచి 10వ తరగతి పూర్తి చేసినవారు మాత్రమే ఈ నియామకానికి అర్హులు.

అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్ట వయస్సు 36 సంవత్సరాలు మించరాదు. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

ALSO READ:Gold Silver Prices Today: టీ20 స్టైల్‌లో దూసుకెళ్లిన పసిడి, వెండి

ఎంపిక ప్రక్రియలో ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)కు పిలుస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ పూర్తయిన తర్వాత తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. SC/ST, PH/EBC మరియు అన్ని వర్గాల మహిళా అభ్యర్థులకు రూ.250 మాత్రమే ఫీజుగా నిర్ణయించారు.

పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ “rrbapply.gov.in” ను సందర్శించాలని RRB సూచించింది.

You may also like

Leave a Comment