కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానంపై 10 గంటల చర్చ
లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ ప్రారంభమైందిగా, మొత్తం 10 గంటల సమయం కేటాయించారు. చర్చ ముగిసిన తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నారు.
చర్చను నడిపేందుకు ప్రత్యేక సభాపతి
అవిశ్వాస తీర్మానం చర్చ సమయంలో సభను నడిపేందుకు ప్రత్యేకంగా ఒక అధ్యక్షుడిని నియమించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రం దీనికి అంగీకరించి సీనియర్ ఎంపీ జగదాంబిక పాల్ (Jagadambika Pal) ను తాత్కాలికంగా సభాపతిగా నియమించింది. ఆయన ఆధ్వర్యంలో లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది.
తీర్మానం తీసుకురావడానికి కారణాలు
విపక్ష నేతరాహుల్ గాంధీ కు రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేయడం, అలాగే బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబయ్ పై చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలను విపక్షాలు కారణాలుగా పేర్కొన్నాయి. ఈ తీర్మానానికి సుమారు 118 మంది ఎంపీలు మద్దతు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యుల మద్దతు ఉండగా, ప్రతిపక్షాలకు 238 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.








