LIVE
Sunday, November 22, 2026
LIVE
LIVE

Japan Earthquake | భూకంపం వచ్చిన ఆపరేషన్ ఆగలేదు.. జపాన్ వైద్యుల ధైర్యానికి సలాం!

by Bajaswamy
12 views
Japanese doctors protecting a patient during surgery amid a powerful 7.1 magnitude earthquake.

Japan Earthquake: ప్రకృతి ప్రకంపనలు ఒక్కసారిగా ప్రపంచాన్ని వణికించినా.. కొందరి బాధ్యత మాత్రం కదలదు. జపాన్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి ఆపరేషన్ జరుగుతుండగా భారీ భూకంపం సంభవించింది. అయినప్పటికీ వైద్యులు తమ ధైర్యాన్ని కోల్పోకుండా శస్త్రచికిత్సను కొనసాగించారు. జపాన్‌లోని కుమమోటో నగరంలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ జరుగుతున్న సమయంలో 7.1 తీవ్రతతో భూమి కంపించింది. ఒక్కసారిగా ఆపరేషన్ థియేటర్ మొత్తం ఊగిపోయింది. గోడలు వణికాయి.. లైట్లు కదిలాయి.. వైద్య పరికరాలు స్థానాలు మార్చుకున్నాయి. అయినా వైద్య బృందం రోగిని ఒంటరిగా వదిలి బయటకు వెళ్లలేదు.

వైరల్‌గా మారిన వీడియోలో వైద్యులు ఆపరేషన్ టేబుల్‌ను గట్టిగా పట్టుకుని రోగిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో వైద్యుడు కదులుతున్న పరికరాన్ని అదుపు చేసే క్రమంలో కిందపడిపోయినా వెంటనే లేచి తన విధులను కొనసాగించారు. భూకంపం ప్రభావం తగ్గిన తర్వాత నిలిచిపోయిన శస్త్రచికిత్సను తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు.

జపాన్ మీడియా ప్రకారం, ఈ ఘటన జులై 28న క్యుషూ ద్వీపంలో సంభవించిన భూకంప సమయంలో జరిగింది. ఈ ప్రకంపనల కారణంగా పలుచోట్ల భారీ నష్టం జరిగింది. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి, రహదారులు ధ్వంసమయ్యాయి. విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. అనేక మంది సహాయ శిబిరాలకు తరలించారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు.

banner
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More