LIVE
Saturday, November 21, 2026
LIVE
LIVE

Mahesh Kumar Goud | కాంగ్రెస్‌లో ఎవరూ అతీతులు కాదు.. క్రమశిక్షణపై మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్

by Bajaswamy
2 views
Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. సొంత పార్టీ నేతలే ప్రభుత్వ పనితీరు, రాజకీయ పరిస్థితులపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ కీలక సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తోందని వెల్లడించారు. పార్టీ నిర్ణయాలకు భిన్నంగా మాట్లాడే నేతల విషయంలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలా వద్దా అనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని, అయితే దానిని అవకాశంగా తీసుకుని పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కొండా సురేఖ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. పలుమార్లు హెచ్చరించిన తర్వాత కూడా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. క్రమశిక్షణ విషయంలో ఎవరికి ప్రత్యేక మినహాయింపులు ఉండవని మహేశ్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను అధిష్ఠానం నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. మొత్తానికి.. కాంగ్రెస్‌లో నేతల బహిరంగ వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు అధిష్ఠానం పరిశీలనకు చేరింది. భవిష్యత్తులో పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More