Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను కేవలం దారి చూపే యాప్‌గా కాకుండా, పూర్తి స్థాయి AI ఆధారిత ట్రావెల్ అసిస్టెంట్‌గా మార్చే దిశగా గూగుల్ కీలక అడుగులు వేసింది. వినియోగదారుల ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు ‘Ask Maps’ పేరుతో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రెస్టారెంట్ల అన్వేషణ నుంచి ట్రిప్ ప్లానింగ్ వరకు అనేక సేవలు ఒకే యాప్‌లో పొందే అవకాశం కల్పిస్తోంది.
కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు సమీపంలోని రెస్టారెంట్లు, హోటళ్లు, పర్యాటక ప్రాంతాలను మ్యాప్స్‌లోనే సులభంగా గుర్తించవచ్చు. ఇష్టమైన వంటకాలను ఎంపిక చేసుకుని మ్యాప్స్ నుంచే నేరుగా ఆర్డర్ చేసే అవకాశం కూడా కల్పించనుంది. అలాగే సమీపంలో జరిగే కాన్సర్టులు, కామెడీ షోలు, ఇతర ఈవెంట్ల వివరాలు తెలుసుకోవడంతో పాటు టికెట్ బుకింగ్ లింకులు కూడా పొందవచ్చు.
జీమెయిల్‌లో ఉన్న ఫ్లైట్, హోటల్ బుకింగ్ వివరాలను మ్యాప్స్‌తో లింక్ చేసి, ప్రయాణ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ సిఫార్సులు అందించే సదుపాయాన్ని గూగుల్ తీసుకొస్తోంది. గతంలో చేసిన ట్రిప్ ప్లానింగ్‌ను గుర్తుంచుకుని అక్కడి నుంచే కొనసాగించే సౌకర్యం కూడా అందిస్తోంది. బస్సులు, మెట్రో, రైళ్లు, ఫెర్రీల లైవ్ రాకపోకల సమాచారం కూడా మ్యాప్స్‌లోనే అందుబాటులో ఉంటుంది.
ఈ ఫీచర్లను భారత్‌తో పాటు 150కిపైగా దేశాల్లో దశలవారీగా విడుదల చేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. ప్రస్తుతం ఫుడ్ ఆర్డర్, ఈవెంట్ సెర్చ్ వంటి సేవలు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో ఇతర దేశాలకు కూడా విస్తరించనున్నట్లు తెలిపింది.
ALSO READ: Japan Earthquake | భూకంపం వచ్చిన ఆపరేషన్ ఆగలేదు.. జపాన్ వైద్యుల ధైర్యానికి సలాం!








